NADHARADHANA FINAL RESULTS RELEASED PLEASE CHECK
NADHARADHANA FINAL RESULTS RELEASED PLEASE CHECK
NADHARADHANA FINAL RESULTS RELEASED PLEASE CHECK
NADHARADHANA FINAL RESULTS RELEASED PLEASE CHECK

Donation

1
Category:

Description

వినమ్ర విన్నపం …

“చందమామ రావే, జాబిల్లి రావే… “ అంటూ అమ్మ పాడితే ఎంత ఏడ్చే పిల్లాడైనా హాయిగా నిదురిస్తాడు.ఏ విషయాన్నైనా గాన రూపంలో గాని, సంగీత రూపంలో గాని అందిస్తే స్పందించని మనస్సుండదు.

 “శిశుర్వేతి, పశుర్వేతి, వేత్తిగాన రసం ఫణిః” అన్నారు కదా !

సంగీత యుక్తమైన పాట సర్వ ప్రాణికోటికే ఒక వరం లాంటిది.

“ఏకం సంగీత విజ్ఞానం చతుర్వర్గ ఫలప్రదం”

(సంగీత జ్ఞానం ధర్మార్థ, కామ, మోక్షాలను కలుగజేస్తుంది.)

ఏ కళకైనా ప్రధానోద్దేశ్యం జనరంజనం. సత్సాంప్రదాయ సంగీతం వల్ల కేవలం జనరంజకత్వమే కాకుండా జన సంస్కరణ కూడా జరుగుతుంది. రాగంతో సమానంగా మనస్సు కదులుతుంది. ప్రశాంతత అలుముకుంటుంది. పాటలకు భాషా భేదం లేదు. ఏ భాషలో పాడినా ఆనందం కలుగుతుంది. విశ్వజనీనమైన భాష సంగీతం. అలాగే సంగీతం విశ్వమంతా వ్యాపించి ఉంది. ప్రకృతిలో సంగీతం మిళితమై మన జీవన గమనంలో భాగమైపోయింది.

అందుకే, మానసిక ఒత్తిడి, ఆందోళనలకు నిలయమైన ఆధునిక ప్రపంచంలో ప్రశాంతచిత్తమైన జీవితం గడపడానికి సంగీత సాధన అవసరం.

సాంప్రదాయ సంగీత సాధనలో రక్తపోటు, మానసిక రుగ్మతలు (డిమెన్షియా, అల్జీమర్స్ వ్యాధి) దూరం అవడమే కాకుండా రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుందని, జ్ఞాపకశక్తి, వాక్పటిమ పెరుగుతుందని శాస్త్రీయ పరిశోధనలు తెలుపుతున్నాయి.

అలాగే ఎటువంటి వారికైనా సంగీత సాధనతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు భారతీయతకు మూలాలైన నిర్ణయం, వినయం, విధేయత, స్నేహభావం, దైవభక్తి, ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందించబడతాయి.

మనుష్యులకు సర్వతోముఖాభివృద్ధి కలిగించి పరిపూర్ణ, మానవులుగా రూపొందించే అద్భుతమైన ప్రక్రియ అయిన సంగీతాన్ని విజయనగరంలో సాంప్రదాయ బద్దంగా నేర్పించడానికి నడుము కట్టింది “రోటరీ దశిగి పేర్రాజు మ్యూజిక్ అకాడమీ”.

గత 66 సంవత్సరాలుగా క్రమశిక్షణలోను, సేవాభావంలోను, స్నేహభావంలోనూ, పేరెన్నికగన్న విజయనగరం రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో లబ్ద ప్రతిష్టులైన సంగీత విద్వాంసుల పర్యవేక్షణలో ప్రారంభించబడిన సంస్థ “రోటరీ దశిగి పేర్రాజు మ్యూజిక్ అకాడమీ.”

కళలకు కాణాచి అయిన విజయనగరంలో సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని జ్వలింపచేయడానికి అహరహం కృషి చేస్తున్న “రోటరీ దశిగి పేర్రాజు మ్యూజిక్ అకాడమీ” కి మీ వంటి వదాన్యులు ఆర్థిక, హార్థిక సహకారం ఉంటే మరింత ఉత్సాహంగా ముందుకి సాగగలదు.

Reviews

There are no reviews yet.

Be the first to review “Donation”

Your email address will not be published. Required fields are marked *

Shopping cart

0
image/svg+xml

No products in the cart.

Continue Shopping